తాండూరు సబ్ కలెక్టర్‌గా కొయ్యాడ ప్రణయ్‌కుమార్..!
– ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు సబ్ కలెక్టర్‌గా కొయ్యాడ ప్రణయ్ కుమార్ నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఐఏఎస్ అధికారులగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్‌లు కేటాయించారు. ఇందులో భాగంగా కొయ్యాడ ప్రణయ్‌కుమార్ ఐఏఎస్ (2024)ను వికారాబాద్ జిల్లాలోని తాండూరు సబ్ కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది.

ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఆర్డీఓ అనిత విషయంలో ఎలాంటి స్పష్టత రాలేదు. తాండూరుకు సబ్ కలెక్టర్‌ను నియమించడంతో ఆర్డీఓ కార్యాలయంకు ఆర్డీఓ స్థాయి నుంచి సబ్ కలెక్టర్ హోదా కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


