ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఇష్టారాజ్యం!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఇష్టారాజ్యం!
– దుకాణాల ముందు రోడ్ల ఆక్రమణ
– రోడ్లపై వస్తువులు ఉంచి వ్యాపారం
– చర్యలు తీసుకోవాలని వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో వ్యాపారుల ఇష్టారాజ్యం కొనసాగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దుకాణాల ముందు ఉన్న రహదారులను ఆక్రమించి, రోడ్లపైనే వివిధ రకాల వస్తువులను ఉంచి వ్యాపారాలు నిర్వహిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని కొన్ని దుకాణాల నిర్వాహకులు తమకు కేటాయించిన స్థలానికే పరిమితం కాకుండా ముందు భాగంలోని రహదారిని కూడా వినియోగిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో ప్రయాణికులు, ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కాంప్లెక్స్‌లో రోడ్లపై వస్తువులు పెట్టి వ్యాపారం చేయడం వల్ల నడిచే వారికి, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని స్థానికులు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా రోడ్లను ఆక్రమించకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, అక్రమంగా ఏర్పాటు చేసిన వస్తువులను తొలగించాలని కోరారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఆక్రమణలపై అధికారులు దృష్టి సారించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు ద్వారా కోరారు.

తాండూరు అభివృద్ధి పరాయి పాలు..!