నరేంద్రమోడి పాలనకే జనం జేజేలు
– బీఆర్ఎస్‌కు ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయం
– తాండూరు అభివృద్ధిపై ఎమ్మెల్యేతో చర్చకు సిద్ధం
– బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీకృష్ణ గౌడ్
– తాండూరులో ముగిసిన ఇంటింటికి బీజేపీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశంలో ప్రధాని నరేంద్రమోడి పాలనకు జనం జేజేలు పలుకుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వికారాబాద్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ అన్నారు. గత నాలుగు, ఐదు రోజులుగా తాండూరు పట్టణంలో చేపట్టిన ఇంటింటికి బీజేపీ కార్యక్రమం ముగిసింది. చివరి రోజు ఆదివారం పట్టణంలోని 16, 19వ వార్డులో చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీకృష్ణ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి బీజేపీపై ప్రచారం నిర్వహించారు. అనంతరం మురళీకృష్ణ గౌడ్‌తో పాటు పలువురు మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్రమోడి పాలనకు ఆపూర్వ స్పందన లభిస్తోందని అన్నారు. బీజేపీతో సుస్థిరమైన సంక్షేమం, అభివృద్ధి జరుగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అవినీతి, అక్రమాలు, స్కాంలతో ఖ్యాతిని సాధిస్తుందని విమర్శించారు. టీఆర్ఎస్ నుంచి వీఆర్ఎస్ గా అవతరించిన పార్టీకి ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయమన్నారు. అదేవిధంగా తాండూరు మున్సిపల్ సమస్యలు రాజ్యమేలుతున్నాయని అన్నారు. తాండూరు రూపురేఖలు మారుస్తామన్నా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, పట్టణ ఇంచార్జ్ సంగెం హన్మంతు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, మహిళ మోర్చ జిల్లా అధ్యక్షురాలు సాహు శ్రీలత, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, కౌన్సిలర్ బాలప్ప, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

