ట్రిగ్గర్ చేస్తే.. ఖబడ్దార్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ట్రిగ్గర్ చేస్తే.. ఖబడ్దార్..!
– అనవసర రాజకీయాల్లోకి పేరు లాగొద్దు
– పార్టీలకు అతీతంగా తాండూరు అభివృద్ధికి కృషి
– చేసే మంచి చూసి ఓర్వలేక బురదజల్లడం సరికాదు
– వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో రూ.2 వేల కోట్లతో 2239 పనులు
– పార్టీలో సీనియర్, జూనియర్ అందరికి పదవులు ఇస్తున్నాం
– మీడియా సమావేశంలో ఆర్బివోఎల్ సీఈవో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : సేవే లక్షంగా పార్టీలకు అతీతంగా తాండూరు అభివృద్ధికి కృషి చేస్తున్నామని, అనవసర రాజకీయా విమర్శలతో ట్రిగర్‌ చేస్తే ఖబడ్దార్ అంటూ ఆర్బీఓఎల్ సిఈవో, తాండూరు కాంగ్రెస్ నాయకుడు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

మంగళవారం తాండూరులోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ పబ్బం గడిపేందుకు కొందరు వ్యక్తులు కావాలని తమపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారాని పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో నాపై కొందరు వ్యక్తులు కక్షపూరితంగా మాట్లాడిన సహనంతో ఉంటూ వారి విజ్ఞతకే వదిలేశాను అన్నారు. నా మంచితనాన్ని చేతగానితనంగా భావించి కొందరు వ్యక్తి గతంగా దూషించడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇక మీదట ఎవరైనా నా పేరు తీసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.

నా ఇంటిని ఒక క్యాంపు కార్యాలయమని, షాడో ఎమ్మెల్యే అని, అక్రమ భూదందలని, ఇసుక ఎర్రమట్టి వ్యాపారం చెతున్నామని మాట్లాడడం పద్ధతి కాదన్నారు. భద్రేశ్వర దేవాలయం, పోట్లీ మహారాజ్ దేవాలయ నిర్మాణాల్లో అక్రమాలు చేశారని ఆరోపిస్తున్న వ్యక్తులకు సవాల్ చేస్తున్నా… నిజంగా నేను ఎక్కడన్నా అక్రమం చేస్తే నిరూపించండి..? దానికి మీరు ఏం చేయమంటే అందుకు సిద్ధమని సవాల్ చేశారు. చేతిలో మైక్ ఉందని, ముందు ప్రజలు కనిపిస్తున్నారని లేనిపోని ఆరోపణలు చేస్తూ విమర్శిస్తే ఇక మాటలతో కాదు చేతలతో బుద్ధి చెప్పడం జరుగుతుందన్నారు. తాండూరు ప్రాంతంలో 35 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తూ ఇక్కడి ప్రాంత ప్రజల సమస్యలు తెలుసుకున్నామని పేర్కొన్నారు.

పరిగి ప్రాంతం నాకు జన్మనిస్తే తాండూరు ప్రాంతం నాకు జీవితాన్ని అందించిందన్నారు. ఇంతటి మహోన్నతమైన తాండూరును ఎన్నటికీ మరువనని నా ప్రాణం ఉన్నంతవరకు తాండూరు ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు. రాజకీయాల్లోకి రాకముందే సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఆర్బీఓఎల్ ఫ్యాక్టరీ ద్వారా స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. తాండూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల అభివృద్ధికి ఫ్యాక్టరీ ద్వారా ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. రక్షణ దళాలకు విరాళం ఇచ్చినట్టు గుర్తు చేశారు.

ప్రత్యక్షంగా పరోక్షంగా ఫ్యాక్టరీ పై స్థానికంగా 2000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని గుర్తు చేశారు. కొందరు వ్యక్తులు కావాలని రాజకీయం చేస్తూ తమపై బురద చల్లడం అవివేకమని అన్నారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో తాండూర్ నియోజకవర్గంలో రూ.2 వేల కోట్లతో 2239 పనులు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్, జూనియర్ అందరికి పదవులు ఇస్తున్నామని అన్నారు. కష్టపడ్డ వారిని తాము ఎప్పటికీ గుర్తుంచుకుంటామని పేర్కొన్నారు. అవకాశం వస్తే జిల్లా పరిషత్ చైర్మన్ కు జిల్లాలో ఎక్కడి నుంచైనా బరిలో ఉంటానని పేర్కొన్నారు. దేవుడు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కూడా సిద్ధమని అన్నారు.

బీసీ శ్మశాన వాటికలకు నిధులివ్వాలి..!