ఇంటి వ‌ద్ద‌నే త‌డి చెత్త‌, పొడి చెత్త వేరు చేయాలి

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

ఇంటి వ‌ద్ద‌నే త‌డి చెత్త‌, పొడి చెత్త వేరు చేయాలి
– వార్డుల్లో ప్ర‌జ‌ల‌కు మున్సిప‌ల్ అధికారుల అవ‌గాహ‌న
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ప్ర‌జ‌లు ఇంటి వ‌ద్ద‌నే త‌డి చెత్త‌, పొడి చెత్త‌ను వేరు చేయ‌డాన్ని అల‌వర్చుకోవాల‌ని తాండూరు మున్సిప‌ల్ అధికారులు సూచించారు. మంగ‌ళ‌వారం తాండూరు ఆర్డీఓ, ఇంచార్జ్ క‌మీష‌న‌ర్ అశోక్ కుమార్ ఆదేశాల మేర‌కు స్వ‌చ్ఛ సర్వేక్షన్ 2022 లో భాగంగా న‌ట్ట‌ణంలోని వార్డ్ నెంబర్ 34లో కాలనీవాసులకు తడి చెత్త, పొడి చెత్తతో పాటు హోం కంపోస్టింగ్‌పై అవగాహన కల్పించారు.
ఈ సంద‌ర్భంగా మున్సిప‌ల్ మేనేజ‌ర్ బుచ్చిబాబు, శానిట‌రీ ఇనుస్పెక్ట‌ర్ శ్యాంసుంద‌ర్, ప‌ర్యావ‌ర‌ణ అధికారి ప్రవీణ్‌లు మాట్లాడుతూ ప్ర‌జ‌లు త‌మ ఇండ్ల‌లో త‌డి చెత్త‌, పొడి చెత్తును త‌ప్ప‌క వేరుచేయాడాన్ని అల‌వ‌ర్చుకోవాల‌న్నారు. త‌డి చెత్త‌, పొడి చెత్త ఇంట్లోనే వేరు చేసి హోం కంపోస్టును త‌యారు చేసుకోవాల‌న్నారు. దీని ద్వార ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త జ‌రుగుతుంద‌న్నారు. రోగాల బారిన ప‌డ‌కుండా ఆరోగ్యంగా ఉంటార‌న్నారు. ఈ కార్యక్రమంలో జవాన్లు, ఆర్పీలు త‌దిత‌ర‌లు పాల్గొన్నారు.