క్రీడలతో ప్రతిభకు పదును
– కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : క్రీడల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా క్రీడాకారుల్లో ప్రతిభ మెరుగుపడుతుందని తాండూరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ అన్నారు. గత మూడు రోజుల క్రితం తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో స్థానిక నాయకులు నవాజ్, మోయిజ్. సంజీవ్ రావుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓల్డ్ తాండూరు యూనిట్ కప్- 5 క్రికెట్ టోర్నమెంట్ కొనసాగుతోంది. బుధవారం నిర్వహించిన రెండో మ్యాచును కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత విద్యార్థి దశ నుంచే క్రీడారంగంలో నైపుణ్యతను సాధించుకోవాలన్నారు. క్రీడల్లో చురుగ్గా పాల్గొంటే ప్రతిభను పదును చేసుకోవచ్చని, దీంతో ఆయా క్రీడల్లో రాణించవచ్చన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. టోర్నమెంట్లో గెలుపును, ఓటమిని సమానంగా తీసుకోవాలన్నారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సహా పరిచి.. క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులకు కరచాలనం చేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కావలి సంతోష్ కుమార్, ఎన్ఎస్ యూఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత్ అనురాగ్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మోయిజ్ అహమ్మద్, నాయకులు హుస్సేన్, మోయిజ్ తదితరులు పాల్గొన్నారు.

