మురుగుకు మోక్ష‌మేద‌యా..!

తెలంగాణ వికారాబాద్

మురుగుకు మోక్ష‌మేద‌యా..!
– అధ్వాన్నంగా మురుగు కాలువ‌లు
– మూడో ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి ముగిసినా ద‌క్క‌ని యోగం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ప‌ట్ట‌ణ ప్రాంతాలు ప‌రిశుభ్రంగా ఉంచ‌డంతో మురుగు కాలువ‌లు ప్రాధాన్యం. అలాంటి మురుగు కాలువ‌లు తాండూరు మున్సిప‌ల్‌లో అధ్వాన్నంగా త‌యార‌య్యాయి. దాదాపు 21 చ‌దర‌పు కిలో మీట‌ర్ల తాండూరు మున్సిప‌ల్ ప‌రిధిలోని 36 వార్డులో 71 వేల మంది జ‌నాభా ఉంది. ప్ర‌తి వార్డులో మురుగుకాలులు ఉన్నాయి. గ‌త కొన్నేండ్ల నుంచి ప‌ట్ట‌ణంలోని ఇందిరాన‌గ‌ర్, సాయిపూర్, మ‌ల్‌రెడ్డిప‌ల్లి, గొల్ల చెరువు, పాత తాండూరు ప్రాంతాల్లో మురుగు కాలువ‌లు లేక‌పోవ‌డం, ఉన్న‌వి ధ్వంసం కావ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప‌ట్ట‌ణంలోని ఇందిరా చౌర‌స్తా నుంచి సాయిపూర్ వెళ్లే మార్గంలో మురుగు కాలువ‌ల దుస్థితి క‌న‌పించినా ప‌ట్టించుకునే నాథులు క‌రువ‌య్యార‌ని ప్ర‌జ‌లు వాపోతున్నారు. మురుగు కాలువ‌ల నిర్మాణానికి టెండర్లు వేశాం.. త్వ‌ర‌లోనే ప‌నులు ప్రారంబిస్తామ‌ని చెప్ప‌డం త‌ప్పా ఇప్పిటి వ‌ర‌కు ప‌నులు చేప‌ట్ట‌లేద‌ని అంటున్నారు. ప‌ట్ట‌ణ ద‌శ‌ను మార్చేందుకు ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన ప‌ట్టిన ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి మూడో విడ‌త ముగిసినా కూడ మురుగుల నిర్మాణానికి యోగం ద‌క్క‌డంలేద‌ని పెద‌వి విరుపు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇప్ప‌టికైనా సంబంధిత అధికారులు మురుగు కాలువ‌ల నిర్మాణం చేప‌ట్టాల‌ని కోరుతున్నారు.