వికారాబాద్ జిల్లా ఎస్పీగా ఎన్. కోటిరెడ్డి

తాండూరు వికారాబాద్

వికారాబాద్ జిల్లా ఎస్పీగా ఎన్. కోటిరెడ్డి
– బ‌దిలీపై వెళ్ల‌నున్న ఎస్పీ నారాయ‌ణ
వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయ‌ణ‌కు ప్ర‌భుత్వం స్థాన‌చ‌ల‌నం క‌ల్పించింది. జిల్లా కొత్త ఎస్పీగా ఎన్.కోటిరెడ్డిని నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఐపీఎస్ హోదాలో ఉన్న ఎన్. కోటిరెడ్డి మ‌హబూబాబాద్ జిల్లా ఎస్పీగా విధులు నిర్వ‌హిస్తున్నారు. అయితే తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్రంలో 30 మంది ఐపిఎస్‌లను బదిలీ చేసింది. ఇందులో భాగంగా ఎన్.కోటిరెడ్డిని వికారాబాద్ జిల్లా ఎస్పీగా బ‌దిలీ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండ‌గా గ‌త మూడేళ్లుగా జిల్లా ఎస్పీగా నారాయ‌ణ ఇక్క‌డ స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేశారు. ఇటీవ‌లే ఆయ‌న‌కు ప్ర‌భుత్వం ఐపీఎస్‌గా ప‌దోన్న‌తి క‌ల్పించింది. జిల్లాలో త‌న‌దైన ముద్ర వేశారు ఎస్పీ నారాయ‌ణ. నిషేధిత గుట్కా ర‌వాణా, అక్ర‌మ ఇసుక ర‌వాణాపై ఉక్కుపాదం మోపారు. టాస్క్‌ఫోర్స్‌ను ప్ర‌వేశ పెట్టి గుడుంబా, గంజాయి సాగుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్నారు.