చిరస్మరణీయుడు రాజీవ్ గాంధీ

తాండూరు రాజకీయం వికారాబాద్

చిరస్మరణీయుడు రాజీవ్ గాంధీ
– వర్థంతిలో కాంగ్రెస్ నేతల నివాళులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : భారత దేశ మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్‌ గాంధీ చిరస్మరణీయుడని తాండూరు కాంగ్రెస్ నాయకులు అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్దంతిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, అబ్దుల్ రవూఫ్‌, పి.బస్వరాజ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, శ్రీనివాస్ తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం వారు మాట్లాడుతూ దేశాభివృద్ధి కోసం రాజీవ్‌ గాంధీ ఎనలేని సేవలందించారని అన్నారు. పేదల కోసం చేసిన సేవలకు ప్రజల్లో గుండెల్లో చిరస్మరణీయుడుగా నిలిచిపోయారని అన్నారు. రాజీవ్‌ గాంధీ ఆశయ సాధనకు అందరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యువనాయకులు బంటు వేణుగోపాల్, వికాస్ జోషి, గూళి పరమేశ్వర్, బాతుల నాగేష్‌, నేతలు, కార్యకర్తలు ఉన్నారు.

ఇదికూడ చదవండి…

అక్షర స్పూర్తి మా నవ్యరెడ్డి..!