వ‌చ్చేనెలలో జిల్లా స్థాయి క్రీడా పోటీల సెల‌క్ష‌న్స్‌

క్రీడలు తాండూరు వికారాబాద్

వ‌చ్చేనెలలో జిల్లా స్థాయి క్రీడా పోటీల సెల‌క్ష‌న్స్‌
– ద‌ర‌ఖాస్తుల‌ను చేసుకొవ‌చ్చు: జిల్లా అధికారి హ‌న్మంత్ రావు
వికారాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి : వ‌చ్చే యేడాది జన‌వ‌రి మొద‌టి వారంలో జిల్లా స్థాయి క్రీడా పోటీల ఎంపిక నిర్వ‌హిస్తున్న‌ట్లు జిల్లా యువ‌జ‌న‌, క్రీడ‌ల శాఖ అధికారి హ‌న్మంత్ రావు సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

జాతీయ యువజన దినోత్సవాలలో భాగంగా జిల్లా స్థాయిలో వివిధ విభాగాలలో సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు వెల్ల‌డించారు. గ్రూప్ డాన్స్ – జానపద నృత్యం, గ్రూప్ సాంగ్స్ జానపద గేయం, ఎలక్యూష్ పోటీలు-హిందీ, ఇంగ్లీష్ వ్యాస రచన పోటీలు- హిందీ, ఇంగ్లీష్, కబడ్డీ పోటీల‌లో 15 నుంచి 29 సంవత్సరాలు వయస్సుల గల యువతీ యువకులకు, బాల బాలికలకు సెలక్షన్లు జ‌రుగుతాయ‌ని చెప్పారు. ఆసక్తి గల వారు తమ వివరాలను జిల్లా యువజన శాఖ కార్యాలయానికి తెలపాలని, వివరాలకు కె.రవికుమార్ (9966147294) ను సంప్రదించాలని సూచించారు. జిల్లా స్థాయిలో నిర్వహించపడే పోటీ తేదీని త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.