దౌర్జన్యాలు కాంగ్రెస్ సంస్కృతి కాదు

తాండూరు రాజకీయం వికారాబాద్

దౌర్జన్యాలు కాంగ్రెస్ సంస్కృతి కాదు
– నోటికొచ్చినట్లు మాట్లడితే ఖబడ్దార్
– పంచాయతీ లెక్కలు తేల్చుకుందాం రండి
– జెడ్పీ స్థానాలు గెలిస్తే రాజకీయ సన్యాసంకు రెడి
– మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీపై, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్డార్ అంటూ డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, పార్టీ నాయకులు మండిపడ్డారు.

శనివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్ మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మండల పార్టీ అధ్యక్షులు జన్నె నాగప్ప, నాయకులు అఫ్పూ(నయూం), లొంక నర్సింలు తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలపై చేసిన వాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ అని, పేదల సంక్షేమానికి పనిచేస్తుందని అన్నారు. అందుకే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ మద్దతు దారులకు పట్టం కట్టారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో దౌర్జన్యాలు, అక్రమాలు చేసే సంస్కృతి లేదని అన్నారు.

గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి.. తల్లి రొమ్మును గుద్దినట్లు పార్టీ మారిన మీరు విమర్శించే అర్హత లేదని అన్నారు. ఎమ్మెల్యేగా అభివృద్ధిని విస్మరించి.. దౌర్జన్యాలు, కమీషన్లు, డ్రగ్స్ వింత సంస్కృతిని తీసుకవచ్చింది మీరే అని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు హడావుడిగా ప్రొసిడింగ్ లు ఇచ్చి చేసిన అభివృద్ధికి బిల్లులు ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు, వార్డు సభ్యులను నిలబెట్టుకునే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో లేకుండా పోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థుల 100 మంది లెక్క చూపిచేందుకు సిద్ధమని, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 70 మంది అభ్యర్థులను చూపించేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు.

తాండూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని, వచ్చే మూడేళ్లలో చేసే అభివృద్ధి చూస్తే మీరు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భయపడడం ఖాయమన్నారు. వచ్చే జెడ్పీటీసీ ఎన్నిక్లలో ఒక్కటి కూడా గెలవలేరని.. అనుకున్న స్థానాలు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకునేందుకైనా సిద్ధమని ధారాసింగ్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలనలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు వంటి పథకాల అమలుతో అందిస్తున్న ప్రజా పాలన వైపే నిలిచారని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఓర్వలేని ప్రచారాలు చేస్తే.. ఎమ్మెల్యేపై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి డైరెక్టర్ జర్నప్ప. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుపాకుల ఆనిల్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

రేపు అయ్యప్ప పడిపూజ