పేకాట ఆడుతూ దొరికిపోయారు

క్రైం తాండూరు వికారాబాద్

పేకాట రాయుళ్ల గుట్టుర‌ట్టు
– 9మందికి ప‌ట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు
– రూ. 30వేలు, నాలుగు ద్విచ‌క్ర వాహ‌నాల స్వాధీనం
యాలాల‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: ప్ర‌భుత్వ నిషేధ పేకాట ఆడుతున్న ఆట‌గాళ్ల గుట్టును వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు ర‌ట్టుచేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ శివారులో గల మార్కండేయ గుడి సమీపంలో ఓ ఇంట్లో కొంద‌రు పేకాట ఆడుతున్నారు. దీనిపై విశ్వ‌స‌నీయ స‌మాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు జిల్లా టాస్క్‌ఫోర్స్ సీఐ ఆధ్వ‌ర్యంలో సిబ్బంది దాడుల‌కు సిద్ద‌మ‌య్యారు. ఇందులో భాగంగా శుక్ర‌వారం తెల్లవారుజామున ఆ ఇంట్లో పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారంతో దాడులు నిర్వ‌హించారు. ఈ దాడుల‌లో 9 మంది పేకాట ఆడుతున్న‌ట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా వీరి వ‌ద్ద నుంచి పేకాట ముక్క‌లు, రూ. 30,600 రూపాయలు, సెల్‌ఫోన్‌ల‌ను తీసుకున్నారు.
దీంతో పాటు అందులోని వారికి చెందిన నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సంఘ‌ట‌న యాలాల పోలీస్టేష‌న్ ప‌రిధిలోకి రావ‌డంతో వివ‌రాల‌ను సేక‌రించి ప‌ట్టుబ‌డిన పేకాట రాయుళ్ల‌ను యాలాల పోలీసులకు అప్పగించారు. ఈ మేర‌కు వారిపై కేసు న‌మోదు చేస్తామ‌ని యాలాల పోలీసులు తెలిపారు.