బీద విద్యార్ధి భవితకు తోడ్పాటు

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

బీద విద్యార్ధి భవితకు తోడ్పాటు
– లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లాప్‌టాప్‌ అందజేత
– సామాజిక సేవకు ప్రాధాన్యం : లయన్స్ క్లబ్ సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓ బీద విద్యార్థి ఉన్నత భవితకు తాండూరు లయన్స్ క్లబ్ సభ్యులు తోడ్పాటు అందించారు. దాతల సహాకారంతో విద్యార్థినికి ఉచితంగా లాప్ టాప్ అందజేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణానికి చెందిన శివాని హైదరాబాద్ లో బీబీఏ చదువుతోంది. ఆమె చదువు కోసం లాప్ టాప్ అవసరమైంది. ఈ విషయం తెలుసుకున్న లయన్స్ క్లబ్ అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్, క్లబ్ పెద్దల ద్వారా క్లబ్ సభ్యులైన దాతలు డా. సంపత్ కుమార్, మహమ్మద్ బాసిత్ ల సహాకారంతో లాప్ టాప్ తీసుకున్నారు.

బుధవారం వారి చేతుల మీదుగా బీద విద్యార్థిని శివానికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివాని కష్టపడి చదవి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా లయన్స్ క్లబ్ ద్వారా విద్యా, వైద్య రంగాలలో పేదలకు, వి ద్యార్థులకు సేవలందించడంలో ముందుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సీనీయర్ సభ్యులు, జిల్లా అడిషనల్ సెక్రటరీ సల్లా దామోదర్, జోన్ చైర్మన్ బసనప్ప, కార్యదర్శి గాజుల వీర ప్రసాద్, వినోద్ జైన్, పసారం బస్వరాజ్, గూలి శివకుమార్, ఆర్డీ సోని తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

రోడ్డేస్తే ఆరు వార్డులకు ఉపయోగం..!