వైశ్య ఫెడరేషన్ ఖ్యాతి పెంచేందుకు కృషి
– వినూత్న సేవా కార్యక్రమాలతో ముందుకెళతాం
– ఇంటర్నేషన్ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఖ్యాతిని పెంచే సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తామని ఫెడరేషన్ జిల్లా నూతన అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ అన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నూతన అధ్యక్షులుగా నియామకమైన సందర్భంగా మంగళవారం తాండూరు వైశ్య ఫెడరేషన్ కమిటి సభ్యులు, తాండూరు వాసవిక్లబ్ సభ్యులు రొంపల్లి సంతోష్ కుమార్‌ను సంయుక్తంగా సన్మానించారు. ఈ సందర్భంగా రొంపల్లి కుమార్ మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులుగా నియమించడంతో తనపై బాధ్యత పెరిగిందన్నారు. వైశ్య ఫెడరేషన్ ఖ్యాతి పెంచేలా వినూత్న సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అందరితో కలిసి ఫెడరేషనన్‌ను అభివృద్ధి పరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులు గౌరీ శంకర్, కార్యదర్శి వెంకట్ దాస్, కోశాధికారి ఆగీరు మహేష్. వాసవిక్లబ్ అధ్యక్షులు వంశి, కార్యదర్శి శ్రావణ్, కోశాధికారి శ్రీకాంత్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

