అభా హెల్త్ కార్డుతో రూ. 5ల‌క్ష‌ల ఆరోగ్య బీమా

ఆరోగ్యం జాతీయం తెలంగాణ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

అభా హెల్త్ కార్డుతో రూ. 5ల‌క్ష‌ల ఆరోగ్య బీమా
– ఎలా న‌మోదు చేసుకోవాలంటే
ద‌ర్శిని డెస్క్‌: ఆర్థికంగా వెనకబడిన నిరుపేదవర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్రం ప్రభుత్వం(Central Government) ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ ఆయుష్మాన్ భవ పథకం ఇప్పుడు ABHA హెల్త్ కార్డుగా మార్చబడింది. ఈ ప‌థ‌కం ద్వారా హెల్త్ కార్డు పొందిన వారికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఐదు లక్షల రూపాయల ఆరోగ్య భీమా లభిస్తుంది. ఈ హెల్త్ కార్ట్ ప్రతి ఆరోగ్యశ్రీ(Arogya Sri) హాస్పిటల్ లో చెల్లుబాటు అవుతుంది. కేంద్ర ప్రభుత్వము ప్రవేశ పెట్టిన ఈ ఉచిత ఆరోగ్య పథకానికి సంబంధించిన కార్డుని ఫ్యామిలీ సభ్యులు మొత్తం తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ భారత్ ABHA పథకంలో చేరి.. ఈ హెల్త్ కార్డుని ఫోన్ నుండే సులభంగా పొందగలరు. ఈ హెల్త్ కావలసిన వారికి గొప్ప ఆరోగ్య కరమైన శుభవార్త.. అయితే తాజాగా ఈ హెల్త్ కార్డు పొందాడానికి కావాల్సిన వెబ్సైట్ ఓపెన్ అయింది. ఈ సైట్ లో రిజిస్టర్ అయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న ఐదు లక్షల రూపాయల ఆయుష్మాన్ ABHA హెల్త్ కార్డ్ లభిస్తుంది.

రిజిస్ట్ర‌ర్ చేసుకోండి ఇలా..
కేంద్రం ప్ర‌క‌టించిన వెబ్ సైట్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ ఆధార్ నెంబరు ఎంట‌ర్ చేసి సబ్మిట్ చేసుకోవాలి. అనంతరం ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉన్న ఫోన్ నెంబర్ కు ఓటిపి వస్తుంది. ఆ ఓటిపి ని మరల టైప్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ను టైప్ చేయమని చెప్పి అడుగుతుంది. అప్పుడు మీ ఫోన్ నెంబర్ ను ఎంట్రీ చేసిన అనంతరం మరలా ఒక ఓటిపి వస్తుంది. అప్పుడు అడిగిన వివరాలను రిజిస్టర్ చేసిన అనంతరం.. మీ ఫోటో తో కూడిన ఆయుష్మాన్ హెల్త్ కార్డు మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు.డౌన్లోడ్ చేసిన ఐడి కార్డును జాగ్రత్తగా ల్యామినేషన్ చేసుకుని భద్రపరచుకోవాలి. ఇదే విధంగా మీ కుటుంబ సభ్యులకు కూడా చేసి ఆయుష్మాన్ భావ ఐడి కార్డులు తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ హెల్త్ కార్డుని అందరూ అప్లై చేసుకొని హెల్త్ కు సంబంధించిన బెనిఫిట్స్ పొందగలరు. అయితే తప్పనిసరిగా ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉండాలి. అప్లై చేసుకున్న ఒకే ఒక్క నిమిషాల్లో హెల్త్ కార్డు వస్తుంది. రిజిస్టర్ చేసుకోవడానికి క్లిక్ చేయాల్సిన లింక్ https://healthid.ndhm.gov.in/ ఓపెన్ చేసి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.