సంక్రాంతిలో జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌ని స‌రి

తాండూరు వికారాబాద్

సంక్రాంతిలో జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌ని స‌రి
– తాండూరు ప‌ట్ట‌ణ సీఐ రాజేంద‌ర్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : సంక్రాంతి పండ‌గపై క‌రోనా పడ‌గ వేసుకుంద‌ని ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని తాండూరు ప‌ట్ట‌ణ సీఐ రాజేంద‌ర్ రెడ్డి సూచించారు. గురువారం రాత్రి ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాండూరులో క‌రోనా కేసులు సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంద‌ని తెలిపారు. గురువారం ఒక్క రోజే 22 కేసులు న‌మోద‌య్యాయ‌ని గుర్తుచేశారు. కావున ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు పాటిస్తూ పండ‌గ‌ను జ‌రుపుకోవాల‌న్నారు. ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేట‌ప్పుడు మాస్కులు ధ‌రించాల‌ని, జ‌నావాసా ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించాల‌ని సూచించారు. అదేవిధంగా పండ‌గ వేళ‌లో చిన్నారులు, యువ‌కులు పతంగులు ఎగుర‌వేసే స‌మ‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. భ‌వ‌నాలు ఎక్కిన‌ప్పుడు విద్యుత్ స్థంబాల‌కు దూరంగా ఉండాల‌న్నారు. ఎక్కువ‌గా గుమిగూడ కుండా వేడుక‌లు జ‌రుపుకోవాల‌న్నారు. అంద‌రికి సంక్రాంతి పండ‌గ శుభాకాంక్ష‌లు తెలుపుతూనే జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని మ‌రోసారి సూచించారు.