దుమ్ము లేస్తోంది.. బాబోయ్..!
– చుక్కలు చూపిస్తున్న పట్టణ రోడ్డు
– ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ రోడ్లపై లేస్తున్న దుమ్ము స్థానికులకు చుక్కలు చూపిస్తుంది. వేసారి పోతున్న ప్రజలు వామ్మో.. దుమ్ము.. బాబోయ్ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాండూరు పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న ప్లైఓవర్ బ్రిడ్జి పక్కన ఇటీవలే సీసీ రోడ్డు వేశారు.
రోడ్డుపై ఉన్న మట్టి దిబ్బలను శుభ్రం చేయకపోవడంతో గత కొన్ని నెలల నుంచి రోడ్డుపై దుమ్ము లేస్తోంది. వాహనాలు వచ్చి, పోయే క్రమంలో వీపరీతంగా దుమ్ము లేవడంతో వెంట వస్తున్న వాహనదారులతో పాటు స్థానికంగా ఉన్న ప్రజలు, వ్యాపారులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది. గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు.
సీసీ రోడ్డు వేస్తే దుమ్ము, దూళీ తొలగి పోవాలి కాని, విరుద్ధంగా ప్రజలను కష్ట్యం పెట్టడం ఏంటని అధికారులపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై దుమ్ము, దూళీ’ లేవకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఇది కూడ చదవండి..

