సంక్రాంత్రి ఖుషీని నింపిన వైశ్య ఫెడ‌రేష‌న్

తాండూరు వికారాబాద్

సంక్రాంత్రి ఖుషీని నింపిన వైశ్య ఫెడ‌రేష‌న్
– గాలిప‌టాల‌ను పంచిన‌ జిల్లా ప్రెసెడంట్ రొంప‌ల్లి సంతోష్ కుమార్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: సంక్రాంతి పండ‌గ సంతోషాన్ని పంచిపెట్టింది ఇంట‌ర్నేష‌న‌ల్‌ వైశ్య ఫెడ‌రేష‌న్ స‌భ్యులు. శ‌నివారం పండగ ని పురస్కరించుకుని వైశ్య ఫెడ‌రేష‌న్‌, తాండూరు వాసవి క్లబ్ సంయుక్త ఆధ్వ‌ర్యంలో చిన్నారుల‌కు గాలి పటాల‌ను పంచారు. ప‌ట్ట‌ణంలోని ఇందిరానగర్ రామ మందిరంలో వైశ్య ఫెడ‌రేష‌న్ జిల్లా ప్రెసిడెంట్ రొంప‌ల్లి సంతోష్ కుమార్ హాజ‌రై చిన్నారులకు గాలిపాటలు పంపిణీ చేశారు. చిన్నారుల‌కు ఉచితంగా గాలి ప‌టాల‌ను పంచి వారిలో పండ‌గ సంతోషాన్ని నింపారు. ఈ సంద‌ర్భంగా రొంప‌ల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ చిన్నారులు జాగ్ర‌త్త‌గా పండ‌గ‌ను జరుపుకోవాల‌న్నారు. తాండూరు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు సంక్రాంతి శుభ‌కాంక్ష‌ల‌ను తెలిపారు. ఈ కార్యక్రమంలో వైశ్య ఫెడరేషన్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ కోశాధికారి అగీరు మహేష్, తాండూరు అధ్యక్షులు గుముడలా గౌరీశంకర్, కార్య‌ద‌ర్శి పార్శి వెంకట్ దాస్, కోశాధికారి శెట్టి సతీష్ కుమార్, వాసవి క్లబ్ అధ్య‌క్షులు కల్వ వంశీ, కార్య‌ద‌ర్శి పోల శ్రావణ్, కోశాధికారి మంతటి శ్రీకాంత్, రాంమందిర్‌ ఆలయ కమిటీ అధ్యక్షులు బోయే రాజు, అంజిలి రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.