శభాష్ బల్దియా జవాన్
– అభినందించిన కోఆఫ్షన్ సభ్యురాలు సారంగా విజయ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్‌కు చెందిన జవాన్‌ను కోఆప్షన్ సభ్యురాలు సారంగా విజయ్‌కుమార్ అభినందించారు. ఇందిరానగర్‌లోని వార్డు నెంబర్ 5 వ వార్డు ఏరియా జవాన్‌గా రవి పనిచేస్తున్నారు. శుక్రవారం తన సొంత ఖర్చులతో వార్డులోని మురుగు ప్రాంతాల్లో దోమల నియంత్రణ కోసం అయిల్ బాల్స్ వేసే కార్యక్రమాన్ని చేపట్టారు.

వార్డుకు చెందిన కోఆప్షన్ సభ్యురాలు సారంగా విజయ్‌కుమార్ తో కలిసి వార్డులో మురుగు నిలిచిన ప్రాంతాల్లో అయిల్ బాల్స్ వేశారు. ఈ సందర్భంగా కోఆప్షన్ సభ్యురాలు సారంగా విజయ్‌కుమార్ ఏరియా జవాన్ రవిని ప్రత్యేకంగా అభినందించారు. దోమల నియంత్రణ కోసం సొంతంగా అయిల్ బాల్స్ వేయడం అభినందనీయమన్నారు. అదేవిధంగా మున్సిపల్ సహాకారంతో వార్డులో ప్రజా ఆరోగ్యంపై దృష్టిసారిస్తామని పేర్కొన్నారు.


