పేదల ఆరోగ్యానికి పెద్దపీట
– ఆపదలో ఉన్నవారికి సీఎంఆర్‌ఎఫ్‌తో అండ
తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన అన్ని మండలాలకు చెందిన 94 మంది లబ్ధిదారులకు దాదాపు రూ. 33లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. సీఎంఆర్‌ఎఫ్ పథకంతో ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని అన్నారు. అనారోగ్యంతో ఉన్న పేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, టీపీపీసీ ప్రచార కార్యదర్శి కరణం పురుషోత్తంరావు, నాయకులు సర్దార్ ఖాన్, ప్రభాకర్ గౌడ్, పెద్దేముల్ మండల అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, తాండూరు మండల అధ్యక్షులు రాజ్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


