గులాబీ ప్ర‌తిష్ట‌ను పెంచండి

తాండూరు రాజకీయం వికారాబాద్

గులాబీ ప్ర‌తిష్ట‌ను పెంచండి
– క‌ష్ట‌ప‌డే వారికి పార్టీలో స‌ముచిత స్థానం
– తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం)
– తాండూరు టీఆర్ఎస్ కమిటి, అనుంబంధ సంఘాల ఎన్నిక
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : వికారాబాద్ జిల్లాలో గులాబీ పార్టీ ప్ర‌తిష్ట‌ను పెంచేందుకు కృషి చేయాల‌ని టీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం) పేర్కొన్నారు. శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ పట్టణ పార్టీ కార్యవర్గం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సెల్, యూత్ కమిటి అనుబంధ కమిటీలను 147 మందితో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు ఆఫ్పూ(నయూం) కొత్తగా నియామకమైన నాయకులకు నియామకపత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి స‌ముచిత స్థానాల‌తో పాటు పదవులు తప్పక వరిస్తాయన్నారు. పార్టీ పటిష్టత, శ్రేయస్సుకు అందరు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అదేవిధంగా త్వరలోనే వార్డు కమిటీలను కూడా ఏర్పాటు. చేస్తానన్నారు. మరోవైపు కొత్తగా నియామకమైన కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ సునితారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.