రాంగ్ సైడ్ లారీ పార్కింగ్..!
– బైకు ఢీకొని వ్యక్తికి గాయాలు
– ప్రమాదంలో బాధితుడి సెల్ ఫోన్ మాయం
-పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంభీకులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : లారీని రాంగ్ సైడ్ పార్కింగ్ చేయడం వల్ల ఓ వ్యక్తి తీవ్రగాయాల పాలై ప్రాణాలమీదకు వచ్చింది. ఈ సంఘటన ఆదివారం తాండూరు పట్టణ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం సీతారాంపేట్ చెందిన నర్సింలు(42) తన బైకు(టీఎస్ 34 ఏ 2797-షైన్)పై మధ్యాహ్నం తాండూరు మండలం అంతారం గ్రామానికి బయల్దేరాడు.
విలియమూన్ చౌరస్తా సమీపంలో హిందుస్తాన్ ట్రేడర్స్ షాపు అపోజిట్ సైడ్ ఏపీ21 డీవై 3159 నెంబర్ గల లారీని రాంగ్ సైడ్ పార్కింగ్ చేసే ఉంచారు. ప్రమాద వశాత్తు నర్సింలు లారీని ఢీ కొట్టారు. దీంతో నర్సింలుకు తీవ్రగాయ్యాలయ్యాయి. చికిత్స నిమిత్తం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నర్సింలును హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు.

జరిగిన సంఘటనపై నర్సింలు బావ దేవాదానం తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో నర్సింలుకు చెందిన మోబైల్ ఫోన్ (ఓప్పొ ఏఏ95జీ) మాయమైందని ఫిర్యాదులో తెలిపారు. ముఖ్యంగా లారీని నిర్లక్ష్యంగా రాంగ్ సైడ్ పార్కింగ్ చేసిన వారిపై చట్టరిత్య చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

ఇదికూడా చదవండి…

