ప్రభుత్వ విద్య బలోపేతానికి సర్కారు కృషి
– తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– జీటీఏ ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి: సర్కారు బడుల్లో విద్య బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. మంగళవారం తాండూరు పట్టణం ప్రభుత్వ నెంబర్ 1 పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం(జీటీఏ) క్యాలెండర్ను మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ బడుల్లో కార్పోరేట్ స్థాయి విద్యనందించేందుకు మనఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టబోతుందన్నారు. ప్రభుత్వ విద్య బలోపేతంపై దృష్టిసారిస్తుందన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ పాఠశాల అభివృద్దికి సహాకారం అందిస్తామని పేర్కొన్నారు. మరోవైపు జీటీఏ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులుగా కె.గోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్.బందెప్ప, మండల అధ్యక్షులుగా మహేష్, మండల ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ ఎన్నిక కావడం పట్ల వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్, ఉపాధ్యాయ సంఘం సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Generating image...