ఐల‌మ్మ పోరాటం మ‌రువ‌లేనిది

తాండూరు రాజకీయం వికారాబాద్

ఐల‌మ్మ పోరాటం మ‌రువ‌లేనిది
– నివాళులు అర్పించిన కౌన్సిర‌ల్లు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణలో ర‌జాకార్లు, పెత్తందారులకు వ్య‌తిరేకంగా చాక‌లి ఐల‌మ్మ సాగించిన పోరాటం మ‌రువ‌లేనిద‌ని తాండూరు మున్సిప‌ల్ కౌన్సిల‌ర్లు సోమ‌శేఖ‌ర్, ప్ర‌భాక‌ర్ గౌడ్, ఆసిఫ్‌లు పేర్కొన్నారు. శ‌నివారం చాక‌లీ ఐల‌మ్మ 37వ‌ వర్దంతి సంద‌ర్భంగా వీవీహెచ్ఎస్ స‌మీపంలోని ఆమె విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం చాక‌లి ఐల‌మ్మ చేసిన పోరాటాలు మ‌రువ‌లేనివ‌న్నారు. ఆమె ఆశ‌య సాధ‌న‌కు అంద‌రు కృషి చేయాల‌న్నారు. ఆమె ల‌క్ష్య‌సాధ‌నతో పాటు హ‌క్కుల కోసం ఉద్య‌మించాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ కౌన్సిల‌ర్లు, ర‌జ‌క సంఘం నాయ‌కులు త‌దిత‌రులు పాల్గొన్నారు.