అట్ట‌హాసంగా సిల్వ‌ర్ జూబ్లీ వివాహా వార్షికోత్స‌వ వేడుక

తాండూరు తెలంగాణ వికారాబాద్

అట్ట‌హాసంగా సిల్వ‌ర్ జూబ్లీ వివాహా వార్షికోత్స‌వ వేడుక
– ఉప్ప‌ల శ్రీ‌నివాస్ దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన రొంప‌ల్లి సంతోస్ కుమార్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్ర టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్, స్వప్న దంప‌తుల‌ 25వ వివాహా వార్షికోత్స‌వ‌ సిల్వర్ జూబ్లీ వేడుక ఆదివారం అట్టహాసంగా జ‌రిగింది.
హైద‌రాబాద్‌లోని హైటెక్స్ నోవేటల్ లో వేడుక‌కు రాజకీయ నాయకులు, ప్రముఖులు హ‌జ‌ర‌య్యారు. ఇందులో భాగంగా వైశ్య ఫెడరేషన్ వికారాబాద్ జిల్లా ప్రెసిడెంట్ రొంపల్లి సంతోష్ కుమార్ ఉప్ప‌ల శ్రీ‌నివాస్ , స్వ‌ప్న దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.
వివాహా వార్షికోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని సభ్యులతో క‌లిసి గజమాలతో స‌త్క‌రించి ఫోటో ఫ్రేమ్ బ‌హుక‌రించారు. వారి అన్యోన్య దాంప‌త్యం స‌ల్లంగా వ‌ర్దిల్లాల‌ని ఆకాంక్షించారు.