బాడీ బిల్డింగ్‌లో మెరిసిన తాండూరు ప‌హిల్వాన్

కెరీర్ క్రీడలు తాండూరు తెలంగాణ వికారాబాద్

బాడీ బిల్డింగ్‌లో మెరిసిన తాండూరు ప‌హిల్వాన్
– మిస్టర్ తెలంగాణ పోటీలో ద్వితీయ బహుమతి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : రాష్ట్ర స్థాయిలో నిర్వ‌హించిన మిస్ట‌ర్ తెలంగాణ పోటీలో తాండూరుకు చెందిన ప‌హిల్వాన్ మ‌హ‌మ్మ‌ద్ వాసిఫ్ మెరిశాడు. ఈనెల 17న‌ కేసీఆర్ జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో 2వ కేసీఆర్ కప్ -2022 పేరుతో మిస్టర్ తెలంగాణ బాడీ బిల్డింగ్ చాంపియన్ షిఫ్ పోటీలు నిర్వ‌హించారు. స్పోర్ట్ అధారిటీ ఆఫ్ తెలంగాణ తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ తరుపున తాండూరు నుంచి మహమ్మద్ వాసీఫ్ పోటీలో పాల్గొన్నారు. 90 కేజీల విభాగంలో ప్రతిభను కనబరిచి ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ మేరకు పోటీలో సత్తా చాటిన యువకుడు వాసీఫ్ను తాండూరు ప్రముఖులు అభినందించారు. ఈ సంద‌ర్భంగా యువ‌కుడు మ‌హ‌మ్మ‌ద్ వాసిఫ్ మాట్లాడుతూ చేయూతనందిస్తే మ‌రింత స‌త్తా చాటుతాన‌ని పేర్కొంటున్నాడు.