ఎల్లుండే హిందూ ఉత్సవ సమితి సమావేశం

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎల్లుండే హిందూ ఉత్సవ సమితి సమావేశం
– ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సెప్టెంబర్ 1వ తేదిన తాండూరు హిందూ ఉత్సవ సమితి సమావేశం నిర్వహిస్తున్నట్లు సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు తెలిపారు.

వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి యేడాది మాదిరిగానే రాబోతున్న వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని సమావేశం ఉంటుందని చెప్పారు.

ఎల్లుండి మంగళ వారం ఉదయం 11 గంటలకు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఈ సమావేశానికి సమితి ప్రతినిధులు, హిందూ బందువులు, సంఘాల నాయకులు హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

బీఎస్‌ఆర్ నివాసంలో రక్షాబంధన్ శోభ