మా కోడలును ఆశీర్వదించండి..!
– ప్రచారం చేసిన మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ
– 24వ వార్డులో ఇంటింటికి వెళ్లిన కోట్రిక నాగలక్ష్మీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో మా కోడలును ఆశీర్వదించాలని మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో 24వ వార్డు నుంచి పోటీ చేస్తున్న తన కోడలు కోట్రిక నాగలక్ష్మి గెలుపుకోసం విజయలక్ష్మీ ప్రచారం చేపట్టారు.

శుక్రవారం కోట్రిక వి జయలక్ష్మీ తన కోడలు నాగలక్ష్మీతో కలిసి వార్డులో ప్రచారం నిర్వహించారు. కోడలులో ఇంటింటికి వెళ్లి ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తారని, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామని అన్నారు. కోట్రిక నాగలక్ష్మీ గెలుపుకోసం విజయలక్ష్మీ చేస్తున్న ప్రచారానికి ఆదరణ లభించింది. నాగలక్ష్మీ గెలుపుకోసం అండగా ఉంటామని ప్రజలు భరోసా అందించారు. ఈ సందర్భంగా నాగలక్ష్మీ మాట్లాడుతూ ప్రజా సేవ ధ్యేయంగా పనిచేస్తానని, కోట్రిక ఇంటి గౌరవంతో పాటు వార్డును ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తానని అన్నారు.

ఇదికూడా చదవండి…

