నగరేశ్వర దేవాలయ అభివృద్ధికి దృష్టిసారించాలి
– ఆలయంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చొరవ చూపండి
– నూతన పాలకవర్గంతో బీజేపీ ఫ్లోర్ లీడర్ నరుకుల సింధూజగౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని శ్రీ నగరేశ్వర దేవాలయ పురోభివృద్ధికి దృష్టిసారించాలని ఆలయ నూతన పాలకవర్గ సభ్యులను మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ నరుకుల సింధూజ గౌడ్ కోరారు. సోమవారం ఆలయంలో నూతనంగా ఎన్నికై ఆలయ కమిటి చైర్మన్‌గా కుంచెం మురళీధర్, ప్రధాన అర్చకులుగా దామోదర్ చారి, దర్మకర్తలుగా కల్వ వీరేశం, నెమలీగ నరహరి, పోకల నర్మదల ప్రమాణ స్వీకారం చేయడం పట్ల ఫ్లోర్ లీడర్ సింధూజ గౌడ్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సింధూజ గౌడ్ మాట్లాడుతూ నూతన కమిటీ ఆధ్వర్యంలో నగరేశ్వర దేవస్థానం అభివృద్ధి పథంలో ఆకాంక్షించారు. అదేవిధంగా దేవస్థానంలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు నూతన కమిటి చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద పటేల్, వికారాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బైండ్ల విజయకుమార్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ, బీజేపీ తాండూరు నియోజకవర్గ ఇంచార్జ్ కన్వీనర్ నరేందర్ గౌడ్, కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, నాయకులు బంటారం సుధాకర్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కల్వ రాజలింగం, పోట్లీ మహారాజ్ దేవస్థానం చైర్మన్ రాజన్ గౌడ్, ఆర్యవైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

