జైలుకు వెళ్లినా మద్యం మాన్తలేరు..!

క్రైం తాండూరు వికారాబాద్

జైలుకు వెళ్లినా మద్యం మాన్తలేరు..!
– తాండూరులో పెరుగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
– జనవరిలో నమోదైన కేసుల లెక్కలివే
తాండూరు, దర్శిని ప్రతినిధి : మద్యం తాగి వాహనాలు నడిపిస్తే జైలు శిక్ష తప్పదని పోలీసులు ఎంతమొత్తుకున్నా మందుబాబులు మాట వినలేదు. ఇంకాస్త డోసు పెంచి పోలీసులు తనిఖీలలో మందుబాబులను పట్టుకుని జరిమానాలు విధించినా మార్పురావడం లేదు. ఈ మద్య కాలంలో మద్యం సేవించి పట్టు బడిన వాహనదారులపై పోలీసులు కేసులు నమోదు చేయడమే కాకుండా జిల్లా సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హజరు పరిచడంతో వారికి జరిమానాలతో పాటు జైలు శిక్షలు పడుతున్నాయి. అయినప్పటికీ మందుబాటులు మద్యం మానడం లేదు.

తాండూరు పట్టణ పోలీస్టేషన్‌ పరిధిలో ఈ ఒక్క నెల రోజుల్లోనే 16 మందికి జైలు శిక్షలు, 40 మందికి జరిమానాలు విధించారు. ఈనెల 3వ తేదిన 10 మందికి జైలు, 7 మందికి జరిమానాలు విధించారు. 10వ తేదిన ఇద్దరికి జైలు, 13 మందికి జరిమాన విధించారు. 11వ తేదిన ఇద్దరికి జైలు, 11 మందికి జరిమాన విధించారు. తాజాగా 24వ తేది శుక్రవారం ఇద్దరికి జైలు శిక్ష 9 మందికి జరిమానాలు విధించారు. ఇందులో కొందరికి రూ. 2వేలు, మరికొందరికి రూ. 1వెయ్యి చొప్పున జరిమానాలు విధించారు.

దీంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేని 20 మందికి జరిమానాలు, మైనర్లు 15 మందికి జరిమానాలు, సుమారు 10 మందికి జరిమానాలు విధించారు. పోలీసులు ఇన్ని చర్యలు తీసుకుంటున్నా మద్యం సేవించి.. డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడపంలో వాహనదారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని పలువురు భావిస్తున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు వాహనదారులకు మద్యం, డ్రైవింగ్ లైసెన్స్, మైనర్లకు బైకులు ఇవ్వడం వంటి అంశాలపై అవగాహనలు కల్పిస్తున్నా.. మార్పు వాహనదారుల్లో కలగాలని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇదికూడా చదవండి…

తల్లీ కూతుళ్ల మిస్సింగ్..!