సీఎం సహయనిధి పేద ప్రజలకు వరం

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

సీఎం సహయనిధి పేద ప్రజలకు వరం
– ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఆరోగ్యాల‌కు భ‌రోసా క‌ల్పిస్తున్న సీఎం స‌హాయ నిధి ప‌థ‌కం పేద‌ల పాలిట వ‌రంగా మారింద‌ని ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి పేర్కొన్నారు. తాండూరుకు చెందిన వేమారెడ్డికి 54 వేలు, తాండూరు మండ‌లం కొత్లాపూర్‌కు చెందిన ఈ.నాగమ్మకు 38వేల‌ను ప్ర‌భుత్వం సీఎం స‌హాయ నిధి కింద మంజూరు చేసింది. దీంతో మంగ‌ళ‌వారం ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి త‌న నివాసంలో ఇద్దరు లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సిఎం అందిస్తున్న సీఎం స‌హాయ నిధి ప‌థ‌కం పేదప్రజల పాలిట వరంగా మారింద‌ని పేర్కొన్నారు. అనారోగ్యంతో వైద్యం చేయించుకోలేని పేద‌ల‌కు ఈ ప‌థ‌కాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కులు క‌ర‌ణం పురుషోత్తంరావు, టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ మాజీ అధ్య‌క్షులు అబ్దుల్ రవూఫ్‌, మార్కెట్ క‌మిటి మాజీ చైర్మ‌న్ వ‌డ్డె శ్రీ‌నివాస్, మాజీ డీపీసీ స‌భ్యులు ప‌ట్లోళ్ల న‌ర్సింలు, మాజీ కౌన్సిర‌ల్ జుబేర్ లాల‌, పీఏసీఎస్ చైర్మ‌న్ వెంక‌ట్రాంరెడ్డి, ఎంపీటీసీ ర‌విశిందే, నాయకులు మ‌సూద్, పండ‌రి, కౌన్సిల‌ర్ రాము త‌దిత‌రులు పాల్గొన్నారు.