మట్కా చిట్టీలతో అడ్డంగా దొరికారు
– ఇద్దరు వ్యక్తులపై పోలీసుల కేసు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మట్కా చిట్టీలతో అడ్డంగా దొరికిన ఇద్దరు మట్కా రాయుళ్లపై తాండూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని సుభాష్ నగర్‌కు చెందిన మహమ్మద్ మజీద్, ఇందిరానగర్‌కు చెందిన ముత్తు శంకర్‌లు పట్టణంలోని బీసీ కాంప్లెక్స్ వద్ద మట్కా చిట్టీలు రాస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారిపై దాడులు జరపగా చిట్టీలతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. వారి వద్ద నుంచి రూ. 10,170/- రూపాయల నగదు, సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎవరైనా మట్కా జూదానికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

