ప్రేమ తత్వంకు ఏసు ప్రతిరూపం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రేమ తత్వంకు ఏసు ప్రతిరూపం..!
– క్రిస్మస్‌ను సంతోషంగా జరుపుకోవాలి
– ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– తాండూరులో సెమి క్రిస్మస్ వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రేమ తత్వానికి ఏసు ప్రభు ప్రతిరూపంగా నిలుస్తారని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ వేడుకలను అందరు కుల మతాలకు అతీతంగా సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. సోమవారం తాండూరు పట్టణం అంతారం రోడ్డు మార్గంలో ఉన్న వైట్ ప్యాలెస్ లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, నాయకులతో కలిసి హాజయ్యారు.

ఈ సందర్భంగా క్రైస్తవ పెద్దలు ప్రతె ్యక ప్రార్థనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు క్రైస్తవుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. క్రిస్మస్ అనగానే ఏసుప్రభు అందరికి గుర్తుకు వస్తారని అన్నారు. ఏసు ప్రభు ప్రేమ తత్వంకు ప్రతిరూపంగా నిలుస్తారని అన్నారు. శాంతికి కూడా చిహ్నంగా నిలిచే ఏసు మార్గంలో నడవాలన్నారు. అదేవిధంగా పండగను అందరు కుల మతాలకు అతీతంగా జరుపుకోవాలన్నారు.

అనంతరం క్రైస్తవ సోదరులతో కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కేక్ కట్ చేశారు. నేతలు ఎమ్మెల్యేకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మార్కెట్ కమిటి చైర్మన్లు పట్లోళ్ల బాల్ రెడ్డి, అంజయ్య, నాయకులు కరణం పురుషోత్తంరావు, డాక్టర్ సంపత్ కుమార్, కౌన్సిలర్లు, క్రిస్మస్ మైనార్టీ జిల్లా నాయకులు కిరణ్, క్రైస్తవ పెద్దలు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

సంబరంగా.. సంతోషంగా.. రాజ్ కుమార్ జన్మదినం