జాతీయ రోడ్డుకు మురుగు మకిలీ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

జాతీయ రోడ్డుకు మురుగు మకిలీ..!
– డ్రైనేజీగా మారిన రహదారి
– ముక్కు మూసుకుంటున్న జనం
– నిర్లక్ష్యంతో పట్టించుకోని అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరుకు ప్రతిష్టాత్మకంగా మంజూరైన జాతీయ రహదారిని అనుసంధానమైన లింకు రోడ్డుకు మురుగు మకిలీ పట్టింది. కంపు ఇంపు కీరీటమై విమర్శల జేజేలను అందుకుంటుంది. ముక్కుమూసుకుని రోడ్డు దాటుతున్న జనం అధికారుల నిర్లక్ష్యానికి తిట్ల దండకంతో పాడుతున్నారు. తాండూరు కాగ్నా నది నుంచి తాండూరు మండలంలోని గౌతాపూర్‌ వరకు జాతీయ రహదారి 167కు అనుసంధానంగా రోడ్డు విస్తరణ చేపట్టారు. పట్టణంలోని బస్టాండు నుంచి ఇందిరా చౌరస్తా వరకు రోడ్డుకు అటు ఇటూ కూల్చివేతలు చేపట్టిన సంగతి తెలిసిందే. బస్టాండ్ నుంచి ఇందిరా చౌరస్తా వెళ్లే మార్గంలో రోడ్డు విస్తరణ కూల్చి వేతల అనంతరం డ్రైనేజీ నిర్మాణ పనులను నత్తనడక చేపడుతున్నారు. ఈ క్రమంలో ఈ మార్గంలోని డ్రైనేజీ వ్యవస్థ అస్థవ్యస్థంగా మారింది.

డ్రైన్‌ నుంచి మురుగు పారేందుకు దారి లేక రోడ్డపైకి నీరంతా వచ్చేస్తుంది. మురుగుతో పాటు చెత్త, చెదారాలు రోడ్డుపైకి వచ్చి దుర్గందబరితంగా మారింది. దీంతో రోడ్డు దాటేందుకు వాహనదారులు, పాదాచారులు ముక్కు మూసుకుంటున్నారు. జాతీయ రోడ్డుకు ఇదేం దుస్థితి అంటూ పేదవి విరుపు విమర్శలు చేస్తున్నారు. కళ్ల ముందే రోడ్డుపై మురుగు పారుతున్న మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు మండి పడుతున్నారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించి మురుగు ఇబ్బందులు తీర్చాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!