కొత్త నిబంధనలు తెస్తోన్న ఆర్బీఐ
– ఇక సీవీవీ వివరాలు గుర్తింపు తప్పనిసరి
దర్శిని ప్రతినిధి : ప్రస్తుతం ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆర్బీఐ కొత్త నిబంధనలను తీసుకవచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇకపై క్రెడిట్, డెబిట్ కార్డుల విషయాలను తప్పక గుర్తించుకోవాల్సిన పరిస్థితులు రాబోతున్నాయని సంకేతాలను ఇస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అప్పుడప్పుడు మార్పులు చేస్తూ ఉంటుంది. క్రెడిట్, డెబిట్ కార్డుల విషయాల్లో కూడా నిబంధనలు మార్పులు చేస్తుంటుంది. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. మోసాలను నివారించేందుకు ఆర్బీఐ పలు నిబంధనలు మారుస్తూ ఉంటుంది. క్రెడిట్, డెబిట్ కార్డుల నుంచి లావాదేవీలు జరిపేటప్పుడు సీవీవీ నెంబర్ గుర్తించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ముందుగానే మనం కార్డు వివరాలు నమోదు చేసుకుని ఉంటాము కాబట్టి. సీవీవీ నెంబర్‌తో పాటు ఓటీపీ ఎంటర్ చేస్తే సరిపోయేది. ఈ సారి క్రెడిట్, డెబిట్ కార్డుపై ఉండే 16 అంకెల నంబర్లను గుర్తించుకోవాల్సి ఉంటుంది. కేవలం నంబర్లే కాదు గడువు తేదీ, సీవీవీ వంటివీ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇక ప్రస్తుతం ఇ-కామర్స్ వెబ్‌సైట్లు, పేమెంట్ సంస్థలను ఉపయోగించి ఒకసారి మనం క్రెడిట్, డెబిట్ కార్డుతో పేమెంట్ చేస్తే మరోసారి లావాదేవీ జరిపేటప్పుడు కేవలం సీవీవీ, ఓటీపీ ఎంటర్ చేస్తే సరిపోయేది. ఒకసారి పేమెంట్ చేశాక మన కార్డుకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా డేటా బేస్‌లో స్టోర్ అయ్యేవి. అయితే.. ఆర్థిక మోసాలను అరికట్టేందుకు డేటా స్టోరేజీకి సంబంధించి నిబంధనలను ఆర్‌బీఐ మార్చనుందని తెలుస్తోంది.

