తాండూరు రూర‌ల్ సీఐ జ‌లంధ‌ర్ రెడ్డికి స్థాన చ‌ల‌నం

తాండూరు వికారాబాద్

తాండూరు రూర‌ల్ సీఐ జ‌లంధ‌ర్ రెడ్డికి స్థాన చ‌ల‌నం
– సంగారెడ్డి డీసీఆర్బీకి బ‌దిలీ చేస్తున్న‌ట్లు ఉత్త‌ర్వులు
– కొత్త సీఐగా రాంబాబు
తాండూరు రూరల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు రూర‌ల్ రూర‌ల్ సీఐ డి.జ‌లంధ‌ర్ రెడ్డి(డీజే రెడ్డి)కి ప్ర‌భుత్వం స్థాన చ‌ల‌నం క‌ల్పించింది. తాండూరు రూర‌ల్ సీఐ స్థానం నుంచి ఆయ‌న‌కు సంగారెడ్డి జిల్లాలోని డీసీఆర్బీకి బ‌దిలీ చేశారు. ఆయ‌న స్థానంలో సంగారెడ్డి జిల్లా డీసీఆర్బీలో ప‌నిచ‌స్తున్న రాంబాబును నియ‌మించారు. ఈ మేర‌కు బుధ‌వారం వెస్ట్ జోన్ ఐజీ ఉత్త‌ర్వులు జారీ చేశారు. త‌క్ష‌ణ‌మే విధుల్లో నుంచి రిలీవ్ కావాల‌ని ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టం చేశారు. అయితే తాండూరు రూర‌ల్ ప‌రిధిలో సీఐ జ‌లంధ‌ర్ రెడ్డి ఉత్త‌మ సేవ‌ల‌ను అందించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్షణకు స‌మ‌ర్థ‌వంతంగా కృషి చేశారు.