విద్యపై నిర్లక్ష్యం చేయోద్దు

తాండూరు రాజకీయం వికారాబాద్

విద్యపై నిర్లక్ష్యం చేయోద్దు
– ఆర్జీకే పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తా
– మున్సిపల్ కౌన్సిలర్ జావిద్
– రాజీవ్‌ కాలనీలో స్కూల్‌ సందర్శన
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థుల చదువు పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని తాండూరు మున్సిపల్ పరిధి 8వ వార్డు కౌన్సిలర్ జావిద్ అన్నారు.

మంగళవారం వార్డు పరిధిలోని రాజీవ్‌ కాలనీలో కొనసాగుతున్న ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాల ఉపాధ్యాయులను కలిసి విద్యార్థులు అందిస్తున్న సదుపాయాలు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు విద్యా బోధ ఎలా జరగుతుందని ఆరా తీశారు. పాఠశాల సమస్యలను, ఇబ్బందులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చక్కటి విద్యను, నాణ్యమైన భోజనం అందించాలన్నారు.

పాఠశాలలో తరగతి గదులు, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకవెళ్లి అభివృద్ధికి దృష్టిసారిస్తామని అన్నారు. ఇప్పటికే పాఠశాలలో విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతినెల ఉత్తమ ప్రతిభను చాటిన విద్యార్థులకు బహుమతులు అందించి ప్రోత్సహించడం జరుగుతుందని, దానిని కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు స్థానిక నేతలు ఉన్నారు.

ఎఎస్‌ జీఎఎంకే సేవలు గ్రేట్..!