ఫైలెట్‌కే బ్రహ్మరథం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఫైలెట్‌కే బ్రహ్మరథం..!
– రోహిత్ రెడ్డిని సన్మానించిన నేతలు
– శుభాకాంక్షలు తెలిపిన రాకేష్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో తాండూరు ఎమ్మెల్యేగా పైలెట్ రోహిత్ రెడ్డికి బ్రహ్మరథం పడతామని బీఆర్ఎస్ తాండూరు మండల ప్రధాన కార్యదర్శి రాకేష్‌ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ తాండూరు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పైలెట్ రోహిత్ రెడ్డి టిక్కెట్‌ దక్కించున్న సంగతి తెలిసిందే. ఈ నేథప్యంలో శనివారం బీఆర్ఎస్ తాండూరు మండల ప్రధాన కార్యదర్శి రాకేష్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా రాకేష్ గౌడ్ మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి రోహిత్ రెడ్డి కృషి చేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేకు ప్రజలు బ్రహ్మరథం పడతారని అన్నారు. భారీ మెజార్టీతో రెండోసారి పైలెట్ ను అసెంబ్లీకీ పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చెంగోల్ యువ నాయకులు కె.నరేష్, రాజు వడ్ల, వడ్డే ఎల్లప్ప, పట్నం ధనరాజ్, కృష్ణ, చిరు ప్రసాద్, పవన్, చంటి, నరేష్ డాన్సర్, మాస్ సన్నీ, అనిల్, అషు డాన్స్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!