ఆన్‌లైన్‌లో పీఎం కిసాన్ ద‌ర‌ఖాస్తు

జాతీయం మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

ఆన్‌లైన్‌లో పీఎం కిసాన్ ద‌ర‌ఖాస్తు
– రిజిస్ట్రేష‌న్ చేసుకోండి ఇలా
ద‌ర్శిని డెస్క్‌: ఇంత‌కుముందు ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి యోజ‌న/ పీఎం కిసాన్ ప‌థ‌కం కోసం ఆఫ్‌లైన్‌లో లేఖ్‌పాల్ లేదా నోడ‌ల్ ఏజెన్సీ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకునేవారు. తాజాగా అధికారిక వెబ్‌సైట్ పీఎంకిసాన్ డాట్ గ‌వ్ డాట్ ఇన్ ద్వారా అప్ల‌యి చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తులో త‌ప్పులు దొర్లినా అప్‌డేట్ చేసుకోవ‌చ్చు. రైతులు త‌మ‌కు తాము గానీ, వ‌సుధా సెంట‌ర్ ద్వారా గానీ ద‌ర‌ఖాస్తు లేదా అప్‌డేట్ చేసుకోవ‌చ్చు. రైతులు త‌మ పేరు, మొబైల్ నంబ‌ర్‌, ఆధార్ నంబ‌ర్ త‌దిత‌ర వివ‌రాలు అప్‌డేట్ చేసుకోవ‌చ్చు. చిన్న‌, స‌న్న‌కారు రైతుల‌ను ఆదుకునేందుకు కిసాన్ స‌మ్మాన్ నిధి యోజ‌న అనే ప‌థ‌కం కింద ప్ర‌తియేటా రూ.6000 కేంద్రం చెల్లిస్తున్న‌ది. మూడు స‌మాన వాయిదాల్లో అంటే రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో జ‌మ చేస్తున్న‌ది.

పీఎం కిసాన్ యోజ‌న‌పై చెక్ లిస్ట్ ఇలా

దేశంలోని రైతులంతా ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ నిధి యోజ‌న కింద అర్హులే. మీరు కూడా రైతే అయితే ప్ర‌ధానమంత్రి కిసాన్ నిధి యోజ‌న ప‌థ‌కం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఇప్పుడు పీఎం కిసాన్ స‌మ్ఆన్ నిధి యోజ‌న ద‌ర‌ఖాస్తు ఆన్‌లైన్‌లో ల‌భిస్తున్న‌ది. ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు నింపొచ్చు. 2018 డిసెంబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి 2019 మార్చి 31 వ‌ర‌కు తొలి విడ‌త పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌చేశారు. దీనిపై పూర్తి వివ‌రాలు తెలుసుకునేందుకు హెల్ప్‌లైన్ నంబ‌ర్ 155261, టోల్ ఫ్రీ నంబ‌ర్‌1800115526 అందుబాటులో ఉంది.