టీయూడ‌బ్ల్యూజే ఐజేయూ క‌మిటీల ఏక‌గ్రీవం

తాండూరు వికారాబాద్

టీయూడ‌బ్ల్యూజే ఐజేయూ క‌మిటీల ఏక‌గ్రీవం
– డివిజ‌న్, మండ‌లాల క‌మిటీల ఎన్నిక‌
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: టీయూడ‌బ్ల్యూజే ఐజేయూ తాండూరు డివిజ‌న్, మండ‌లాల క‌మిటీలు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యాయి. సోమ‌వారం తాండూరు ప‌ట్ట‌ణంలోని ఆర్య‌వైశ్య క‌ళ్యాణ మండ‌పంలో తాండూరు డివిజ‌న్ అధ్య‌క్షులు న‌ర్సింలు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌టేల్ న‌రేంద‌ర్(లిట్టు)ల ఆధ్వ‌ర్యంలో యూనియ‌న్ స‌ర్వ‌స‌భ్య‌, సభ్య‌త్వ న‌మోదు స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి హాజ‌రైన జిల్లా అధ్య‌క్షులు శ్రీ‌నివాస్ చారి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కొత్త‌ప‌ల్లి శ్రీ‌నివాస్ చారి, రాష్ట్ర కౌన్సిల్ స‌భ్యులు వేణుగోపాల్ రెడ్డిల స‌మ‌క్షంలో తాండూరు డివిజ‌న్, తాండూరు టౌన్, తాండూరు మండ‌లం, పెద్దేముల్ మండ‌లం, బ‌షీరాబాద్ మండ‌లాల క‌మిటీల‌ను ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. తాండూరు డివిజ‌న్ అధ్య‌క్షులుగా పెరుమాళ్ల వెంక‌ట్‌రెడ్డి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా రామ‌కృష్ణ‌(ఆర్కే), తాండూరు ప‌ట్ట‌ణ అధ్య‌క్షులుగా మ‌ఠం నిరంజ‌న్ స్వామి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా మ‌హేష్, తాండూరు మండ‌ల అధ్య‌క్షులుగా వ‌డ్ల సంగ‌మేష్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా వెంక‌టేష్‌, పెద్దేముల్ మండ‌ల అధ్య‌క్షులుగా పాండు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా గ‌యాజ్, బ‌షీరాబాద్ మండ‌ల అధ్య‌క్షులుగా శివ కుమార్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా సైమండ్స్‌ల‌ను ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సంద‌ర్భంగా నూత‌నంగా ఎన్నికైన అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు మాట్లాడుతూ జ‌ర్న‌లిస్టులు ప్ర‌ధానంగా ఎదుర్కొంటున్న ఇండ్లు, పిల్ల‌ల ఫీజుల రాయితీ, ఉచిత విద్య స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తామ‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో యూనియ‌న్ స‌భ్యులు వాసు(వెంక‌టేశం), న‌ర్సంహారెడ్డి, రాంచెంద‌ర్, జిల్లా కోశాధికారి ర‌ఘు, కార్య‌వ‌ర్గ స‌భ్యులు గోపాల్, సీనియ‌ర్ పాత్రికేయులు క‌ర‌ణం భీంసేన్ రావు, జ‌ర్న‌లిస్టులు శాంతు, వెంక‌ట్రాంరెడ్డి, రాంరెడ్డి, శ్రీ‌నివాస్ రెడ్డి, రాంచెంద‌ర్, కోస్గం న‌ర్సింలు, డి.శ్రీ‌నివాస్, వంశి, దీపక్ ఠాకూర్, వెంక‌ట్, శ్రీ‌ధ‌ర్‌, ర‌మేష్, ఖాజ‌, ప్ర‌వీణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.