రేపు సీజ్ చేసిన వాహ‌నాల వేలం

తాండూరు వికారాబాద్

రేపు సీజ్ చేసిన వాహ‌నాల వేలం
– తాండూరు ఎక్సైజ్ సీఐ తుక్యానాయ‌క్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు ప్ర‌జ‌ల‌కు ఎక్సైజ్ శాఖ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రోభిషన్ అండ్ ఎక్సైజ్ కేసులో పట్టుబడిన వాహనాలను వేలం నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ తుక్యానాయ‌క్ తెలిపారు. ఎక్సైజ్ సూప‌రిండెంట్ వ‌ర‌ప్ర‌సాద్ ఆదేశాల మేర‌కు రేపు బుధ‌వారం ఉద‌యం 11-30 గంట‌ల‌కు ప‌ట్ట‌ణంలోని ఎక్సైజ్ కార్యాల‌యంలో వాహ‌నాల వేలానికి ఏర్పాట్లు చేసిన‌ట్లు చెప్పారు. తాండూరు ఎక్సైజ్ శాఖ ప‌రిధిలో వివిధ కేసుల్లో ప‌ట్టుబ‌డిన 5 వాహ‌నాల‌కు ఈ వేలం నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ వేలంలో తాండూరు, వికారాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల ప్ర‌జ‌లు వేలంలో పాల్గొనవ‌చ్చ‌న్నారు. వేలంలో ఆసక్తి మేర‌కు వేలం పాడి వాహ‌నాల‌ను సొంతం చేసుకోవాల‌ని సూచించారు. ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు.