సామాన్యులు జాగ్రత్త..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

సామాన్యులు జాగ్రత్త..!
– అధిక డబ్బులు తరలిస్తే బుక్కైపోవడం ఖాయం
– కోడ్‌ను పక్కాగా అమలు చేస్తున్న అధికారులు
– మూడు సంఘటనల్లో రూ. 8లక్షలకు పైగా సీజ్
– తాండూరు నియోజకవర్గంలో సంఘటనలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: సామాన్యులు జాగ్రత్త అంటూ తెలంగాణ ఎన్నికల కోడ్‌ హెచ్చరిస్తోంది. ఎందుకంటే ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడం వల్ల సామాన్యులు రూ. 50 వేల కంటే ఎక్కువగా డబ్బులు తరిలించే పరిస్థితి లేదు. ఇది బడా వ్యాపారులు, నేతలు, సామాన్యులకు వర్తిస్తుంది. ఒకవేళ అంతకుమించి తరలించాల్సి వస్తే అందుకు సంబంధించిన దృవపత్రాలను చూపించాల్సి ఉంటుంది. లేకుంటే బుక్కై పోవడం ఖాయం.
ఇందంతా ఇప్పుడు ఎందుకంటే వికారాబాద్‌ జిల్లా తాండూరులో ఎన్నికల కోడ్‌ను పోలీసులు అధికారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఆధారాలు లేని డబ్బులు తరలించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ప్రతి వాహనాలను, వ్యక్తులను తనిఖీలు చేస్తూ నోట్ల కట్టలను పట్టేసుకుంటున్నారు. తాజాగా గురువారం తాండూరు నియోజకవర్గంలో మూడు సంఘటనల్లో పోలీసులు దాదాపు రూ. 8 లక్షల నగదును సీజ్ చేశారు. తాండూరు పట్టణంలో రెండు సంఘటనలు, రూరల్‌లోని కరణ్‌ కోట్ పోలీస్టేషన్‌ పరిధిలో మరో సంఘటన జరిగింది.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం కల్లూరు ప్రాంతానికి చెందిన కిరాణా వ్యాపారి కంట్లి విజయ్ కుమార్ కరణ్‌ కోట్ పోలీస్టేషన్‌ పరిధిలోకి రాగానే పోలీసులు అతన్ని సోదా చేయగా రూ. 60వేల 600లు లభ్యమయ్యాయి. నిబంధనలకు విరుద్దంగా డబ్బులు కలిగి ఉండడంతో వాటిని సీజ్ చేయడం జరిగిందని కరణ్‌ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి ప్రకటించారు. అదేవిధంగా తాండూరు పట్టణంలోని విలియమూన్ చౌరస్తా వద్ద పట్టణ పోలీసులు తనిఖీలు చేస్తుండగా బైకు మీద వస్తున్న పాండు చారి అనే వ్యక్తి వద్ద రూ. 2లక్షల 50 వేలను కలిగి ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా పట్టణంలోని వినాయక చౌరస్తా వద్ద మప్టిలో ఉన్న పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా కలాల్ మల్లయ్య అనే వ్యక్తి వద్ద రూ. 5 లక్షల 46 వేల 620లు కలిగి ఉన్నట్లు గుర్తించారు.

దీంతో ఇద్దరు వ్యక్తుల నుంచి మొత్తం రూ. 7 లక్షల 96 వేల 620లను సీజ్ చేసీనట్లు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. కరణ్‌ కోట్ పోలీస్టేషన్‌ పరిధితో పాటు తాండూరు పట్టణ పోలీస్టేషన్‌ పరిధిలో చేసిన తనిఖిల్లో పోలీసులు మొత్తం రూ. 8లక్షలకు పైగా డబ్బులను సీజ్ చేశారు. సీజ్ చేసిన నగదును ఎన్నికల అధికారుల ముందు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు అధికారులు మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ప్రజలు, వ్యాపారులు, నేతలు ఎవరైనా సరే నిబంధనలకు విరుద్దంగా రూ. 50 వేల కంటే ఎక్కువగా డబ్బులు తరలిస్తే సీజ్ చేయడం జరుగుతుందని, రూ. 50వేల మించి తరలిస్తే అందుకు సంబంధించిన దృవపత్రాలను కలిగి ఉండాలని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి..

మోగిన ఎలక్షన్ నగారా..!