పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి
– ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– ప్రధాని మోడి దిష్టిబొమ్మ ఊరేగింపు, దహనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : సామాన్యులపై ధరల పిడుగు వేస్తోన్న కేంద్రానికి రోజులు దగ్గర పడ్డాయని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు పేర్కొన్నారు. కేంద్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ గురువారం తాండూరు పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య కళ్యాణ మండపం నుంచి మోడి దిష్టిబొమ్మను చించొల్లి రోడ్డు వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, నాయకులు కేంద్రానికి, ప్రధాని మోడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డున ప్రధాని నరేంద్రమోడి దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం రోడ్డుపై ఖాళీ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు మాట్లాడుతూ కేంద్రం ధరలను పెంచి సామాన్యులపై భారం మోపిందన్నారు. నిత్యవసర ధరలతో పేదల నడ్డి విరుస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. పెంచిన పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పద్దోళ్ల నర్సింలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు వికల్ నాయక్, ఉప్పరి మహేందర్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, రాజుగౌడ్, పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), మండల అధ్యక్షులు రాందాస్, పెద్దముల్ మండల అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్ యాదవ్, బషీరాబాద్ మండల అధ్యక్షులు రాములు నాయక్, ఎంపీటీసీల జిల్లా ఫోరం అధ్యక్షులు సాయిరెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షులు రాములు, బషీరాబాద్ పిఎసిఎస్ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, నాయకులు అజయ్ ప్రసాద్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ జుబేర్ బాల, కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, విజయాదేవి, రాము, వెంకన్నగౌడ్, టీఆర్ఎస్ పట్టణు ప్రధాన కార్యదర్శులు ఎం.శ్రీనివాస్, సంతోష్ గౌడ్, యువనాయకులు మంతన్ గౌడ్ అశోక్, నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


