టెట్ ద‌ర‌ఖాస్తుల‌కు హెల్ప్‌లైన్..!

కెరీర్ తాండూరు తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

టెట్ ద‌ర‌ఖాస్తుల‌కు హెల్ప్‌లైన్..!
– జూన్ 12 వ‌ర‌కు అందుబాటులో సేవ‌లు
హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ పాఠశాల విద్యా శాఖ TSTET 2022 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు TSTET అధికారిక సైట్ tstet.cgg.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్లు అప్లై చేసుకోవడానికి వ‌చ్చే నెల‌ ఏప్రిల్ 12వ తేది వ‌ర‌కు గ‌డువు ఉంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. రెండు పేపర్లు రాయాలనుకునే అభ్యర్థులు ఒకే దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ వేరు వేరు అప్లికేషన్స్ చేస్తే.. అపుడు వేర్వేరు పరీక్షాకేంద్రాలను కేటాయించే అవకాశం ఉంది. కనుక టెట్ రెండు పేపర్లు రాయాలను కొనేవారు ఒకే దరఖాస్తు చేసుకోవాలి. ఈ విధానంపై అభ్యర్థులకు ఏర్ప‌డే సందేహాలు, సూచనల కోసం హెల్ప్ లైన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. నేటి నుంచి జూన్‌ 12 వరకు హెల్ప్‌డెస్‌ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. వివరాలకు 040-23120340, 23120433, 8121010310, 8121010410 నంబర్లకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. మ‌రోవైపు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు వారి హాల్‌టికెట్లను జూన్‌ 6 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు