రాజీవ్ స్వ‌గృహ ప్లాట్ల‌కు ప‌క‌డ్బందీ రిజిస్ట్రేష‌న్

తాండూరు వికారాబాద్

రాజీవ్ స్వ‌గృహ ప్లాట్ల‌కు ప‌క‌డ్బందీ రిజిస్ట్రేష‌న్
– అన్ని మౌళిక స‌దుపాయాలు క‌ల్పిస్తాం
– 14న మిగిలి పోయిన ప్లాట్ల‌కు బ‌హిరంగ వేలం
– వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ కె.నిఖిల
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు – హైద‌రాబాద్ రోడ్డు మార్గంలోని రాజీవ్ స్వగృహ కాల‌నీలో అన్ని స‌దుపాయ‌ల్పించ‌డంతో పాటు వేలంలో ప్లాట్లు ద‌క్కించుకున్న వారికి ప‌క‌డ్బందీగా రిజ‌స్ట్రేష‌న్ చేయ‌డం జ‌రుగుతుంద‌ని వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ కె.నిఖిల స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం తాండూరు మండ‌ల ప‌రిష‌త్ కార్యాల‌యంలో రాజీవ్ స్వ‌గృహ ప్లాట్ల వేలంపై ఫ్రీబిడ్ స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ తాండూరు-హైదరాబాద్ రహదారికి దగ్గరలో ఉన్న యాలల మండలం కోకట్ గ్రామ పరిధి సర్వే నంబర్ 52 నందు దు మోహ టౌన్షిప్ లో మిగిలిపోయిన ప్లాట్లకు ఈనెల 14న బ‌హిరంగ వేలం వేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ప్రభుత్వమే స్వయంగా ప్లాట్ల వేలం వేయడం జరుగుతున్నందున అందులో తప్పనిసరిగా అన్ని రకాల మౌలిక సదుపాయాలతో పాటు రోడ్లు, విద్యుత్తు, నీటి సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ప్లాట్లకు పకడ్బందీ రిజిస్ట్రేషన్, గ్యారెంటీ ఉంటుందని ఆమె అన్నారు. ముఖ్యంగా తాండూరు పరిసరాల్లో ఔటర్ రింగ్ రోడ్డు వచ్చినందున సమీపంలో ఉన్న ప్లాట్లకు భవిష్యత్తులో మంచి విలువ పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు. తాజాగ స్వ‌గృహాని 71 ఫ్లాట్ల‌కు వేలం వేస్తున్న‌ట్లు, ఇందులో 55 సెమీ ఫినిష్‌డ్, 16 ఓపెన్ ప్లాట్లు ఉన్నాయ‌ని వెల్ల‌డించారు. 250 గ‌జాల‌కు సంబంధించి 15 ప్లాట్లు, 200 గజాల‌కు సంబంధించి 9 ప్లాట్లు, 150 గ‌జాల‌కు సంబంధించి(అసంపూర్తిగా) 10 ప్లాట్లు, 100 గ‌జాల‌కు సంబందించి 31 ప్లాట్లు ఉన్నాయ‌ని తెలిపారు. వేలంలో పాల్గొనాల్సిన వారు రూ. 10 వేల డీడీ చెల్లించాల్సి ఉంటుంద‌న్నారు. వేలంలో ప్లాట్లు ద‌క్కించుకుంటే వారం రోజుల్లో డ‌బ్బులు చెల్లించాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ సమావేశంలో తాండూరు ఆర్డీవో అశోక్ కుమార్, జిల్లా పరిశ్రమల అధికారి వినయ్ కుమార్, జిల్లా పారిశ్రామిక మౌలిక సదుపాయాల డిప్యూటీ జనరల్ మేనేజర్ అనిల్ కుమార్, తాండూరు త‌హసిల్దార్ చిన్న అప్పలనాయుడు, మున్సిప‌ల్ మేనేజ‌ర్ న‌రేంద‌ర్ రెడ్డి, వ్యాపారులు పాల్గొన్నారు.