వేసవిలో అల్లంతో భద్రం
– అతిగా తీసుకుంటే ప్రమాదం
దర్శిని డెస్క్ : ఔషధ గుణాలున్న అల్లంను వేసవిలో తీసుకోవడంలో జాగ్రత్తలు వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి కాలాల్లో అందరు అల్లం తీసుకుంటారు. అయితే వేసవిలో అల్లం శరీరానికి వేడి చేస్తుందని దానిని తినేందుకు కొందరు ఇష్టపడరు. ఇది ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అల్లంతో ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. అల్లం జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది. ఉదయాన్నే అల్లం, నిమ్మరసం, తేనె కలిపి తింటే ఆరోగ్యం లభిస్తుంది. కాని వేసవిలో అల్లం తీసుకోవడంతో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. వేసవిలో(Summer) రోజుకు 4 గ్రాముల కంటే ఎక్కువ అల్లాన్ని తినకూడదు. రక్తస్రావం లేదా డయాబెటిస్తో బాధపడేవారు వేసవిలో అల్లం తీసుకోవడం మంచిది కాదు. గుండె సంబంధిత వ్యాధిగ్రస్తుల్లో గుండె దఢను కూడ పెంచుతోంది. ఎక్కువ అల్లం మీ కడుపులో యాసిడ్ రిఫ్లక్స్ లేదా బర్నింగ్ లక్షణాలను కలిగిస్తుంది.

