యూట్యూబ్ చూసి డెలివరీ..!
– భార్యకు ప్రవసం చేసిన భర్త
– చివరకు ఏం జరిగిందంటే..?
దర్శిని డెస్క్: మహిళల ప్రసూతి సేవల కోసం ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. వాటిని లబ్దిదారులు కూడా వినియోగించుకుంటున్నారు. అయితే కొంత మంది సాధారణ ప్రసవం కోసం ఇంకా పాత ఆచారాలను అలవంభించాలని ఆలోచిస్తున్నారు. అలాంటి సందర్భాలు ప్రాణాల మీదకు తెచ్చిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా పాత అలవాట్లతో పాటు సాంకేతిక పరిజ్ఞానంలో అందుబాటులోకి వచ్చిన యూట్యూబ్ చూసి ఓ భర్త తన భార్యకు ప్రసవం చేశాడు. ఆలస్యంగా వచ్చిన ఈ సంఘటన కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణగిరి జిల్లాలోని పోచంపల్లి సమీపంలో పులియాంపట్టి అనే గ్రామానికి చెందిన లోకనాయకి అనే మహిళకు 2021లో అనుమంతపురం గ్రామానికి చెందిన మాదేశ్‌తో వివాహము జరిగింది. మాదేశ్ తన గ్రామంలో సేంద్రియ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవలే అతడి భార్య గర్భం దాల్చింది. దీంతో ఆమె భర్త మాదేశ్ సేంద్రియ పద్ధతి లాగే తన భార్యకు ప్రసవం జరగాలని భావించాడు. ఇందుకోసం ఎలాంటి మందుల సహాయం లేకుండా, కనీసం వైద్య పరీక్షలు కూడా చేయించలేదు.
ప్రసవ సమయంలో కూడా ప్రభుత్వం అందించేటటువంటి వ్యా్క్సిన్లతోపాటుగా పౌష్టికాహారాన్ని కూడా నిరాకరించాడు. అతడే తన భార్యకు గింజలు, ఆకుకూరలు లాంటివి ఆహారంగా అందించేవాడు. ఈ క్రమంలోనే ఆగస్టు 22వ తేదీన ఇంట్లో లోకనాయకి ఉంది. అయితే ఆమెకు ఒక్కసారిగా నొప్పులు మొదలయ్యాయి. ఇది గమనించి భర్త మాదేశ్ యూట్యూబ్‌లో చూస్తూ తన భార్యకు ప్రసవం అయ్యేలా చేశాడు. చివరికి ఆమె మగశిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు సరైన రీతిలో వైద్యం అందలేదు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో భర్త మాదేశ్ ఇక చేసేదేం లేక కన్నియర్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే లోకనాయకి మరణించింది. దీంతో భర్త మాదేశ్ షాకయ్యాడు. ఇక పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోచంపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ వైద్యురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి…

