తాండూరు ప్రజలారా త్వరపడండి..!
– ఆస్తిపన్ను మొత్తం చెల్లిస్తే 5శాతం రాయితీ
– మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణ ప్రజలారా త్వరపడండి అంటూ మున్సిపల్ అధికారులు ప్రజలకు మంచి అవకాశాన్ని ప్రకటించారు. ఈ నెలాఖరులోగా ప్రజలు వారి ఆస్తి పన్నులను మొత్తం చెల్లిస్తే అందులో 5 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులను జారీ చేసిందని తాండూరు ఆర్డీఓ, మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్ తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తిపన్నులను మొత్తం చెల్లిస్తే ఈ సదుపాయం వర్తిస్తుందని స్పష్టం చేశారు. లబ్దిదారులు ఈనెల 30 వ తేది వరకు గడువు ఉంటుంది, ఈలోగా పన్నులు చెల్లిస్తే 5 శాతం రాయతీ వర్తిస్తుందన్నారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆస్తి పన్నులను చెల్లించాలని సూచించారు. పూర్తి వివరాలకు తాండూరు మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.


