24 నుంచి వేస‌వి సెల‌వులు

తాండూరు తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

24 నుంచి వేస‌వి సెల‌వులు
– జూన్ 12 వ‌ర‌కు కొన‌సాగింపు
హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఈనెల 24 నుంచి వేస‌వి సెలవులు ఉంటాయ‌ని రాష్ట్ర విద్యాశాఖ అక‌డామిక్ క్యాలెండ‌ర్‌లో ప్ర‌క‌టించింది. రాష్ట్రంలో 1 నుంచి 9వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు స‌మ్మెటివ్ అసెస్‌మెంట్(ఎస్ఏ-2) ప‌రీక్ష‌లు శ‌నివారం ప్రారంభ‌మ‌య్యాయి. ఈ ప‌రీక్ష‌లు ఈనెల 22 వ‌ర‌కు కొన‌సాగనున్నాయి. 23న ఫ‌లితాల‌ను వెల్ల‌డించనున్నారు. దీంతో ఈ నెల 24 నుంచి వేస‌వి సెల‌వులు ప్రారంభమ‌వుతున్నాయి. జూన్ 12 వ‌ర‌కు వేస‌వి సెల‌వులు కొన‌సాగుతాయ‌ని, 13న పాఠ‌శాల‌లు పునఃప్రారంభ‌మ‌వుతాయ‌ని విద్యాశాఖ పేర్కొంది. మ‌రోవైపు వ‌చ్చే నెల మే 23 నుంచి జూన్ 1వ తేది వ‌ర‌కు ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు జ‌ర‌గనున్నారు. ప‌రీక్ష‌ల‌ను దృష్టిలో ఉంచుకుని మే 22 వ తేది వ‌ర‌కు పది విద్యార్థుల‌కు ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు కొన‌సాగుతాయ‌ని విద్యాశాఖ స్ప‌ష్టం చేసింది.