అంబేద్క‌ర్ సేవ‌లు మ‌రువ‌లేనివి

తాండూరు రాజకీయం వికారాబాద్

అంబేద్క‌ర్ సేవ‌లు మ‌రువ‌లేనివి
– బీజేపీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా జ‌యంతి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: దేశ ప్ర‌జ‌ల సంక్షేమానికి, అభ్యున్న‌తికి డా.బీఆర్ అంబేద్క‌ర్ చేసిన సేవ‌లు మ‌రువ‌లేనివ‌ని బీజేపీ నాయ‌కులు అన్నారు. గురువారం భార‌త‌ర‌త్న, రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్క‌ర్ 131వ జ‌యంతిని బీజేపీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ప‌ట్ట‌ణంలోని అంబేద్క‌ర్ చౌర‌స్తాలో అంబేద్క‌ర్ విగ్ర‌హానికి బీజేపీ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి యు.ర‌మేష్ కుమార్‌తో పాటు నాయ‌కులు పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌తో పాటు ద‌ళితుల సంక్షేమానికి అంబేద్క‌ర్ చేసిన పోరాటాలు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌న్నారు. ఆయ‌న ఆకాంక్ష‌తోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాట‌య్యింద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు సుద‌ర్శ‌న్ గౌడ్, కౌన్సిల‌ర్లు అంతాంరం ల‌లిత‌, బాల‌ప్ప‌, మాజీ కౌన్సిల‌ర్ వినోద్ జైన్, నాయ‌కులు బంటారం భ‌ద్రేశ్వ‌ర్, బీర‌ప్ప‌, పూజారి పాండు, చంద్ర‌శేఖ‌ర్, బొప్పి శ్రీ‌హ‌రి, జ‌గ‌న్ ముదిరాజ్, మిట్టు శ్రీ‌నివాస్, ఎస్సీ మోర్చ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు ర‌వి, భానుప‌వార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.